- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: మరి కొన్ని రోజులలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలం జరగనుంది.దిశ, వెబ్‌డెస్క్: మరి కొన్ని రోజులలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలం జరగనుంది.దిశ, వెబ్‌డెస్క్: మరి కొన్ని రోజులలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలం జరగనుంది. దీనితో అన్ని జట్ల మేనేజ్‌మెంట్‌లు కసరత్తులు ప్రారంభించాయి. ఏ ఆటగాడిని కొనుగోలు చేయాలి.. ఎవరిని కెప్టెన్‌ను చేయాలనే ఆలోచనలో పడ్డాయి. ఇప్పటికే రిటెన్షన్ పాలసీ ప్రకారం పాత 8 జట్లు ముగ్గురి చొప్పున ఆటగాళ్లను అంటిపెట్టుకున్నాయి. మిగిలిన ప్లేయర్లు వేలంకు రానున్నారు. కొత్తగా వచ్చిన రెండు జట్లు ఈ నెల చివర వరకు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవచ్చు.
దీనిలో భాగంగా పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టును వీడిన విషయం తెలిసిందే. దీనితో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో ఉంది. అయితే మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఢిల్లీ రిటెన్షన్ చేసుకోలేదు. దీనితో అయ్యర్ వేలంలో పాల్గొననున్నాడు. కాగా, పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అయ్యర్‌ను మెగా వేలంలో దక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. జట్టులోకి తీసుకుని అయ్యర్‌ను కెప్టెన్‌ను చేయాలని భావిస్తోందట.






