- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్తాన్ కొత్త కుట్రలు.... టీమిండియా ప్లేయర్ల ప్రాక్టీస్ రద్దు..!
దుబాయ్ లో పాకిస్థాన్ క్రికెటర్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు. టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ రద్దు చేసుకున్నారట

IND VS PAK
దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ కారణంగా టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ తప్పుడు నిర్ణయాల వల్ల టీమిండియా ప్రాక్టీస్ సెషన్... రద్దయింది. ఇవాళ దుబాయ్ వేదికగా యూఏఈ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కచ్చితంగా గెలవాలి. లేకపోతే సూపర్ 4 అవకాశాలు చేజారే ప్రమాదం ఉంటుంది. అయితే... టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వనందుకు గాను... కారణమైన రిఫరీ ఆండీని తొలగించాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది. అతని టోర్నమెంట్ నుంచి తొలగిస్తేనే యూఏఈ తో మ్యాచ్ ఆడతామని కూడా డిమాండ్ పెట్టింది. ఈ తరుణంలో... పాకిస్తాన్ ప్రాక్టీస్ కూడా చేయలేదట.
నిన్నటి వరకు మొండి పట్టు పట్టి కూర్చుందట పాకిస్తాన్. అయితే.. దుబాయ్ లోనే ఉన్న టీమిండియా ప్లేయర్లు.. తర్వాతి మ్యాచ్ కోసం అబుదాబీ వెళ్లకుండా... అక్కడే ఉన్నారు. దుబాయ్ లోనే నిన్నటి వరకు ప్రాక్టీస్ చేశారు. అయితే... తాజాగా పాకిస్థాన్ డిమాండ్ మేరకు ఏసీసీ కూడా దిగివచ్చింది. రిఫరీ ఆండీని తొలగించి.. మరో కొత్త వ్యక్తిని తీసుకున్నారట. ఈ ప్రకటన రాగానే... దుబాయ్ లో పాకిస్థాన్ క్రికెటర్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు. ఇవాళ సాయంత్రమే మ్యాచ్ ఉంది. గ్రౌండ్ లోనే ఉదయం పాకి క్రికెటర్లు ఉండటంతో.. టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ రద్దు చేసుకున్నారట. రేపు ఇక నేరుగా అబుదాబీ వెళ్లనున్నారట. అబుదాబీలో ఒమన్ తో టీమిండియా మ్యాచ్ జరుగనుంది.






