ఇండియాకు తిరిగి వచ్చేస్తున్న గిల్ సేన

by velandi.Saikiran |

స్వదేశానికి టీమిండియా ప్లేయర్లు చేరుకున్నారు. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ నిన్నటితో ముగిసిన

ఇండియాకు తిరిగి వచ్చేస్తున్న గిల్ సేన
X

దిశ, వెబ్ డెస్క్: స్వదేశానికి టీమిండియా ప్లేయర్లు చేరుకున్నారు. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. 2-2 తేడాతో ఈ ఐదు టెస్టుల సిరీస్ డ్రాగా ముగిసింది. చివరి టెస్టులో మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన స్పెల్ వేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. చివరి టెస్ట్ గెలిచిన టీమిండియా ఇవాళ స్వదేశానికి బయలుదేరింది. దాదాపు రెండు నెలల పాటు ఇంగ్లాండులో గడిపిన టీమిండియా ప్లేయర్లు... ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు వేకువ జామున ఇండియాలో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇందులో భాగంగానే టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్, శార్దుల్ ఠాకూర్ విమానంలో ప్రయాణిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. టీమిండియా కోచింగ్ స్టాఫ్ తో కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను దిగి... ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా... ఐదవ టెస్ట్ చివరి రోజు 35 పరుగులను అడ్డుకొని టీం ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.

Next Story