వన్డే క్రికెట్ చరిత్రలో సంచలనం.. Ishan Kishan డబుల్ సెంచరీ

by GSrikanth |   (  Updated:2022-12-10 09:24:18  IST  )

వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా యువ బ్యాట్‌మెన్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.

వన్డే క్రికెట్ చరిత్రలో సంచలనం.. Ishan Kishan డబుల్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా యువ బ్యాట్‌మెన్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ(126 బంతుల్లో 200 పరుగులు) చేసిన అతిపిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌లో చట్టోగ్రామ్ వేదికగా జరుగనున్న మూడో వన్డేలో కిషన్ ఈ ఫీట్ సాధించాడు. కాగా, ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు వన్డేల్లో ఓటమి చెందిన టీమిండియా.. సిరీస్ కోల్పోయింది. దీంతో చివరి వన్డేలో ఎలాగైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో కిషన్ మొదటినుంచి దూకుడుగా ఆడుతూ బంగ్లా బౌలర్లకు పరీక్ష పెట్టాడు. అంతేగాకుండా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సైతం అద్భుతంగా రాణిస్తూ ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికే 300 స్కోరును దాటేసిన టీమిండియాకు భారీ స్కోరు వచ్చే అవకాశం ఉంది. కాగా, వన్డేల్లో కిషన్‌కు ఇదే మొదటి సెంచరీ కావడం గమనార్హం.

Read more:

రోహిత్ శర్మ, Sachin Tendulkar,, వీరేంద్ర సెహ్వాగ్‌ల సరసన Ishan Kishan

Next Story