- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Plane Crash : విమాన ప్రమాద మృతులకు టీంఇండియా సంతాపం
అహ్మదాబాద్ విమాన ప్రమాద(Ahmedabad Plane Crash) మృతులకు టీంఇండియా ప్లేయర్స్ సంతాపం తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ విమాన ప్రమాద(Ahmedabad Plane Crash) మృతులకు టీంఇండియా ప్లేయర్స్ సంతాపం తెలిపారు. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన కొన్ని సెకన్లలోనే ఎయిర్ ఇండియా బోయింగ్(Air India Boeing) విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, మెడికల్ కాలేజీ విద్యార్థులతోసహ ఇప్పటి వరకు 269 మంది చనిపోయారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీంఇండియా(Team India) జూన్ 20 నుంచి 5 వ టెస్టుల సిరీస్ ఆడనుంది.
అందులో భాగంగా బెకేన్ హమ్ లో ఇంగ్లాండ్ తో నేడు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతోంది. ఆటకు ముందు టీంఇండియా ప్లేయర్స్, సిబ్బంది అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు 2 నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అలాగే చేతికి నల్లటి బ్యాండ్స్ ధరించి ఆటలో పాల్గొన్నారు. మరోవైపు లార్డ్స్ మైదానం వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న WTC ఫైనల్ మ్యాచ్ కు ముందు ఇరు జట్లు విమాన ప్రమాద మృతులకు సంతాపం తెలిపి చేతికి నల్ల రిబ్బన్లు ధరించారు.






