- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడో టెస్టులో టీంఇండియా ఓటమి
by Muthe.Rajitha |
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్(ENG vs IND) మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ లో టీంఇండియా ఓటమి పాలైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్(ENG vs IND) మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ లో టీంఇండియా ఓటమి పాలైంది. చివరి రోజు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో సెషన్ లో ఇంగ్లాండ్ బౌలర్లు భారత్ పై పూర్తిగా పట్టు సాధించారు. మొదటి ఇన్నింగ్స్ లో ఇరు జట్లు 387 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 170 పరుగులకు ఆలౌట్ అయింది. జడేజా(61)తో పోరాడినా ఓటమి తప్పలేదు. దీంతో 5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యం సాధించింది. నాలుగవ టెస్టు ఈనెల 23 నుంచి జరగనుంది.
Next Story






