బోర్డుకు స్పాన్సర్లు కరువు.. WTC ఫైనల్‌లో జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి టీమ్ ఇండియా..!

by Disha Web Desk 13 |
బోర్డుకు స్పాన్సర్లు కరువు.. WTC ఫైనల్‌లో జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి టీమ్ ఇండియా..!
X

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 7-11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకున్నాయి. అయితే ప్రస్తుతం టీమ్ ఇండియా జెర్సీకి కొత్త స్పాన్సర్స్‌ను బీసీసీఐ పట్టుకోలేకపోయింది. ఇంతకాలం టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా బైజూస్ ఉంది.. నవంబర్ వరకు ఈ కాంట్రాక్ట్ ఉండగా.. దీంతో బైజూస్ దీని నుంచి తప్పుకుంది. బైజూస్ అర్ధంతరంగా తప్పుకోవడంతో మరో కొత్త స్పాన్సర్‌ను పట్టుకోవడానికి బీసీసీఐ ప్రయత్నిస్తోంది. అయితే ఇకపై తక్కువ సమయానికి చిన్న కంపెనీలకు ఈ అవకాశం ఇవ్వకుండా.. ఎక్కువ కాలం నిలిచే డీల్స్ మాత్రమే చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.

ఈ క్రమంలోనే టూల్ కిట్ స్పాన్సర్‌షిప్ కోసం ఐదేళ్లపాటు ఆదిదాస్‌తో డీల్ చేసుకుంది. కొత్త స్పాన్సర్‌తో డీల్ కుదుర్చుకునేందుకు తగిన సమయం లేకపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ప్లేన్‌ జెర్సీతోనే (బీసీసీఐ, అడిడాస్‌ లోగో ఉంటాయి) బరిలోకి దిగనున్నట్లు సమాచారం. బీసీసీఐ ఇటీవలే భారత టూల్ కిట్ స్పాన్సర్‌గా అడిడాస్‌తో డీల్ చేసుకున్న విషయం తెలిసిందే.

డబ్ల్యూటీసీ కోసం రెడీ అవుతున్న టీమిండియా ఆటగాళ్ల జెర్సీపై ఆదిదాస్ లోగో, బీసీసీఐ లోగో మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ స్పాన్సర్ విషయంలో బీసీసీఐ జరుపుతున్న చర్చలు ఇంకా సఫలం కాలేదని తెలుస్తోంది. 'చిన్న చిన్న డీల్స్ చేసుకోవడం కన్నా కూడా.. ప్రముఖ కంపెనీలతో లాంగ్ టర్మ్ డీల్స్ చేసుకోవడమే భారత క్రికెట్‌కు బాగుంటుందని అనుకుంటున్నాం' అని బీసీసీఐ అధికారి తెలిపారు. దీనిపై త్వరలోనే బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.


Next Story