- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్!
ఐపీఎల్ 2027 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ సరికొత్త వ్యూహం.. నూతన బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్!

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2027) రాబోయే సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఫ్రాంచైజీ ఒక భారీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh)ను ఢిల్లీ జట్టు తమ నూతన బ్యాటింగ్ కోచ్‌గా నియమించనుంది. ఐపీఎల్‌లో యువరాజ్ సింగ్‌కు ఇదే తొలి అధికారిక కోచింగ్ బాధ్యత కావడం విశేషం. గత రెండు ఐపీఎల్ సీజన్లలో (2025, 2026) ఆశించిన స్థాయిలో రాణించలేక ప్లేఆఫ్స్‌కు చేరడంలో విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్, రాబోయే సీజన్ కోసం తమ సపోర్ట్ స్టాఫ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసే పనిలో పడింది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం రాబోయే రెండు సీజన్ల (2027, 2028) పాటు ఫ్రాంచైజీ నిర్వహణ బాధ్యతలను జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ చేజిక్కించుకోనుంది. ఇందులో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. గంగూలీ పర్యవేక్షణలోనే యువరాజ్ సింగ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా జట్టులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం. గతంలో యువరాజ్ సింగ్.. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లకు వ్యక్తిగత మెంటార్‌గా వ్యవహరించి వారి కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అధికారికంగా ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌లో చేరనుండటం జట్టులోని యువ బ్యాటర్లకు కొండంత బలాన్ని ఇస్తుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.






