- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చివరి టెస్టులో బుమ్రా ఆడతాడా?.. ప్రస్తుతం ఫిట్‌గానే ఉన్నాడంటున్న కోచ్!
చివరి టెస్టులో బుమ్రా ఆడతాడా అంటే? ప్రస్తుతం ఫిట్‌గానే ఉన్నాడని కోచ్ చెప్తున్నారు. ఈ విషయంపై గిల్, గంభీర్, ఫిజియో కలిసి డెసిషన్ తీసుకుంటారట.

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో చివరి టెస్టుకు సిద్దం అవుతున్న టీమిండియా.. స్టార్ పేసన్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ విషయంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మాట్లాడుతూ బుమ్రా ఫిట్‌గానే ఉన్నాడని చెప్పాడు. అయితే బుమ్రా ఐదో టెస్టు ఆడటం గురించి ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదన్నాడు.
‘ప్రస్తుతానికి బుమ్రా ఫిట్‌గానే ఉన్నాడు. వర్క్‌లోడ్ ప్రకారం చూసుకున్నా.. నాలుగో టెస్టులో తను ఒక ఇన్నింగ్సులోనే మాత్రమే బౌలింగ్ చేశాడు. కాబట్టి మా ఫిజియో, కెప్టెన్, హెడ్ కోచ్ కలిసి చర్చించి ఒక డెసిషన్ తీసుకుంటారు’ అని కోటక్ వివరించాడు.
ఈ సిరీసులో భారత్ తరఫున బెస్ట్ బౌలర్ బుమ్రానే. మూడు టెస్టుల్లో 3.04 ఎకానమీ, 26 సగటుతో 14 వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటన ప్రారంభానికి ముందే బుమ్రాతో వరుసగా టెస్టు మ్యాచులు ఆడించకూడదని అనుకుంటున్నామని, కాబట్టి అతను మూడు టెస్టులే ఆడతాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు.
కానీ లార్డ్స్‌లో ఓడిపోవడంతో మాంచెస్టర్ మ్యాచ్‌లో తప్పనిసరిగా బుమ్రాను ఆడించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో.. సిరీస్ డ్రా చేసుకోవాలన్నా సరే చివరి టెస్టులో టీమిండియా గెలవాల్సిందే.






