టీమిండియా చెత్త ఫీల్డింగ్.. భారీ స్కోర్ దిశగా పాకిస్తాన్

by velandi.Saikiran |   (  Updated:2025-09-21 16:08:02  IST  )

మొదట బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్.... భారీ స్కోరు దిశగా వెళ్తోంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఫీల్డింగ్ అత్యంత

టీమిండియా చెత్త ఫీల్డింగ్.. భారీ స్కోర్ దిశగా పాకిస్తాన్
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఆసియా 2025 టోర్నమెంట్ సూపర్ ఫోర్లో భాగంగా ఇవాళ టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లోమొదట బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్.... భారీ స్కోరు దిశగా వెళ్తోంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఫీల్డింగ్ అత్యంత దారుణంగాతయారయింది.

ఈ మ్యాచ్ లో ఏకంగా మూడు క్యాచులు టీమిండియా ప్లేయర్లు వదిలేశారు. పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ ఇచ్చిన రెండు క్యాచ్ లను అభిషేక్ శర్మ వదిలేసాడు. ఈ నేపథ్యంలోనే అతడు 34 బంతుల్లోనే హఫ్ సెంచరీ చేసి దుమ్ము లేపాడు. అటు కుల్దీప్ యాదవ్.. కూడా అత్యంత దారుణంగా ఫీల్డింగ్ చేయడంతో పాకిస్తాన్ భారీ స్కోర్ దిశగా వెళ్తోంది. ప్రస్తుతానికి 15 ఓవర్లు ముగిశాయి. ఇప్పటివరకు నాలుగు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ 121 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ సల్మాన్ , మహమ్మద్ నవాజ్ క్రీజులో ఉన్నారు.

Next Story