- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాధువుల్లా మారిపోయిన టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఫొటోలు వైరల్
ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కుంభమేళాకు ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి పది కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్లకు సంబంధించిన ఆసక్తికరమైన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్లేయర్లంతా సాధువులుగా మారి మహా కుంభమేళాను సందర్శించినట్లు చూడొచ్చు. అయితే, అవి నిజమైన ఫొటోలు కాదు.. ఏఐ మాయ. టీమిండియా అభిమానులు 'ది భారత్ ఆర్మీ' ఈ ఫొటోలను ఏఐ సాయంతో సృష్టించింది. 'క్రికెటర్లు మహా కుంభమేళాకు వెళితే' అనే క్యాప్షన్‌తో ఈ ఏఐ క్రియేటేడ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో స్టార్ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తదితరులు కాషాయ దుస్తుల్లో సాధువుల్లా కుంభమేళాను దర్శించుకున్నట్లుగా రూపొందించారు. టీమిండియా అభిమానులు సూపర్ అంటూ ఈ ఫొటోలకు కామెంట్లు పెడుతున్నారు.






