Rohit Sharma: హిట్‌మ్యాన్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జూనియర్ రోహిత్ ఆగయా

by Gantepaka Srikanth |

టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి తండ్రి అయ్యారు.

Rohit Sharma: హిట్‌మ్యాన్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జూనియర్ రోహిత్ ఆగయా
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి తండ్రి అయ్యారు. శుక్రవారం రాత్రి ముంబైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో ఆయన భార్య రితిక(Rithika) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. కాగా, రోహిత్ శర్మ-రితిక దంపతులకు ఇప్పటికే సమైరా(Samaira) అనే కూతురు ఉంది. రితికను 2015లో పెద్దలను ఒప్పించి రోహిత్ శర్మ పెళ్లి చేసుకున్నారు. మరోవైపు.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఇప్పటికే టీమిండియాకు చేరుకుంది. డెలివరీ ఉండటం వల్లే రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. ఈ గేమ్ ఆరంభానికి వారం రోజుల ముందే రితిక ప్రసవించిన నేపథ్యంలో ఇక రోహిత్ శర్మ తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే.. తొలి టెస్ట్‌కు బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ చేయనున్నారు. ప్రస్తుతం జట్టు నెట్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది.

Next Story