అరుదైన రికార్డు సాధించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

by Gantepaka Srikanth |

టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన ఘనత సాధించారు.

అరుదైన రికార్డు సాధించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన ఘనత సాధించారు. వన్డేల్లో 11వేల ప‌రుగులు చేశారు. ఈ ఫీట్ సాధించిన నాలుగో భార‌త బ్యాట‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. అంద‌రికంటే వేగంగా భార‌త స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ.. కేవ‌లం 222వ ఇన్నింగ్స్‌లోనే చేరుకున్నారు. తర్వాతి స్థానాల్లో రోహిత్ (261 ఇన్సింగ్స్), స‌చిన్ టెండూల్క‌ర్ (276 ఇన్నింగ్స్), రికీ పాంటింగ్ (286 ఇన్నింగ్స్ ), సౌర‌వ్ గంగూలీ (288 ఇన్నింగ్స్) ఉన్నారు. ఇక వ‌న్డేల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన క్రికెట‌ర్ల‌లో రోహిత్ సెకండ్ స్థానంలో ఉన్నాడు. 338 సిక్స‌ర్ల‌తో త‌ను సెకండ్ ప్లేసులో ఉండ‌గా.. పాక్ విధ్వంస‌క ప్లేయ‌ర్ షాహిద్ ఆఫ్రిది (351 సిక్స‌ర్లు) తొలి ప్లేస్‌లో ఉన్నాడు.

ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో భాగంగా బంగ్లాదేశ్‌తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ శుభారంభం చేసింది. టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 46.3 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 231 పరుగులు చేసి విజయం సాధించింది. భారత ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ (101*) సెంచరీ బాదాడు. కెరీర్‌లో ఇది 8వ శతకం కాగా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెంచరీ కావడం విశేషం.

Next Story