- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కింగ్ ఈజ్ బ్యాక్’.. రోహిత్ శర్మ సూపర్ సెంచరీ
గతకొంతకాలంగా ఫామ్ లేమితో బాధపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) సూపర్ ఫామ్‌లోకి వచ్చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: గతకొంతకాలంగా ఫామ్ లేమితో బాధపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) సూపర్ ఫామ్‌లోకి వచ్చేశారు. ఒడిశాలోని కటక్ మైదానం(Cuttack Stadium) వేదికగా భారత్(Team India), ఇంగ్లండ్(England)ల మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో సత్తా చూపించాడు. చాలా రోజుల తర్వాత అద్భుతమైన సెంచరీ బాదాడు. మొదటి నుంచి నిలకడగా రాణిస్తూ జట్టుని విజయానికి చేరువ చేస్తున్నారు. మొత్తంగా 75 బంతుల్లో ఏడు సిక్సులు, తొమ్మిది ఫోర్లతో సెంచరీ చేశారు. దీంతో ఇన్నాళ్లు హిట్‌మ్యాన్‌పై విమర్శలు చేసిన వారిని.. సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఓ ఆటాడుకుంటున్నారు. ‘ద రియల్ కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
కాగా, అంతకుముందు రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్ కూడా అద్భుతంగా రాణించారు. 52 బంతుల్లో 60 పరుగులు చేశారు. ఇందులో ఒక సిక్స్, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. 17వ ఓవర్లో ఒవర్టన్ వేసిన మొదటి, మూడు బంతులకు ఫోర్లు బాదిన గిల్.. నాలుగో బంతికి ఔటయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (5) నిరాశపర్చాడు. ఆదిల్ రషీద్ వేసిన 19.3 ఓవర్‌కు వికెట్‌కీపర్ ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శఱ్మకు తోడుగా శ్రేయాస్ అయ్యార్ ఉన్నారు.






