- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్.. తొలి భారతీయుడిగా రికార్డు
టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన ఘనత సాధించారు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన ఘనత సాధించారు. టీ20 ఫార్మాట్‌లో 450 మ్యాచ్‌లు ఆడిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించారు. ఐపీఎల్(IPL), దేశవాళీ, ఇంటర్నేషనల్ మ్యాచులన్నీ కలిపి రోహిత్ 450 మ్యాచ్‌లు ఆడారు. రోహిత్ శర్మ తర్వాత భారత ఆటగాళ్లలో దినేష్ కార్తీక్(412), విరాట్ కోహ్లీ(401), ఎమ్ఎస్ ధోనీ(393), సురేశ్ రైనా(336) ఉన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 555 మ్యాచులతో వెస్టిండీస్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ తొలి స్థానంలో ఉన్నారు.
రెండో స్థానంలో మరో వెస్టిండీస్(West Indies) ఆటగాడు బ్రావో(582), మూడో స్థానంలో పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక్(555), నాలుగో స్థానంలో ఆండ్రె రస్సెల్(540), ఐదో స్థానంలో సునీల్ నరైన్(537) ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు. ఏప్రిల్ 2007లో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు తరపున రోహిత్ టీ20 అరంగేట్రం చేశాడు. 18 ఏళ్లుగా టీ20 ఫార్మాట్ ఆడుతున్న హిట్‌మ్యాన్.. 450 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్నాడు.






