- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
INDvsENG: టీమిండియా ఆలౌట్.. ఇంగ్లండ్ ఎదుట భారీ స్కోర్
by Gantepaka Srikanth |
భారత్, ఇంగ్లాండ్(England) మధ్య జరుగుతున్న తొలి టెస్టు(Test Match)లో టీమిండియా(Team India) ఆలౌటైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఇంగ్లాండ్(England) మధ్య జరుగుతున్న తొలి టెస్టు(Test Match)లో టీమిండియా(Team India) ఆలౌటైంది. తొలిరోజు 359/3తో ముగించిన భారత్.. రెండో రోజు 112 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 113 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (147), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (134), ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కేఎల్ రాహుల్ (42) పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన స్కోరును అందించారు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్, జోష్ టంగ్ తలో నాలుగేసి వికెట్లు తీయగా, బ్రైడెన్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఇంగ్లాండ్ టూర్‌లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ ఆడబోతోంది.
Next Story






