టీడీసీఏకు గుర్తింపు ఇవ్వాలంటూ బీసీసీఐకి వినతి

by Phanindra |

బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్‌ను టీడీసీఏ అధ్యక్షుడు కలిశారు. తమ సంస్థకు కూడా గుర్తింపు ఇవ్వాలని బీసీసీఐ పెద్దలకు వినతి పత్రం అందజేశారు.

టీడీసీఏకు గుర్తింపు ఇవ్వాలంటూ బీసీసీఐకి వినతి
X

దిశ, స్పోర్ట్స్: తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ)కు గుర్తింపు ఇవ్వాల‌ని బీసీసీఐ పెద్దల‌ను టీడీసీఏ అధ్యక్షుడు అల్లీపురం వెంక‌టేశ్వర్ రెడ్డి కోరారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాల‌యంలో ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీఐ నూతన అధ్యక్షుడు మిథున్ మ‌న్హాస్‌, కార్యద‌ర్శి దేవ‌జిత్ సైకియా, కోశాధికారి ప్రభుతేజ్ సింగ్ భాటియాను వెంక‌టేశ్వర్ రెడ్డి కలిశారు. ఈ సమయంలో టీడీసీఏకు గుర్తింపు ఇవ్వాలంటూ వినతి పత్రాన్ని వీరికి అందించారు.

హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 220 క్లబ్ టీమ్‌లు ఉంటే, మిగిలిన 32 జిల్లాల‌కు తొమ్మిది ఉమ్మడి జిల్లా జ‌ట్లే ఉన్నాయ‌ని, దీంతో తెలంగాణ గ్రామీణ క్రికెట‌ర్లకు అన్యాయం జ‌రుగుతోంద‌ని వెంక‌టేశ్వర్ తన రెడ్డి లేఖ‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏలో అవినీతిని కూడా తన లేఖలో ప్రస్తావించారు. ఇంతకాలం తెలంగాణ క్రికెట‌ర్లకు జ‌రిగిన అన్యాయాన్ని స‌రిదిద్దాలంటే తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘానికి గుర్తింపు ఇవ్వాల‌ని వెంక‌టేశ్వర్ రెడ్డి కోరారు

Next Story