- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుమ్రా బౌలింగ్‌లో 6 సిక్సర్లు కొడతా...పాకిస్థాన్ ప్లేయర్ వార్నింగ్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ ప్లేయర్ సైమ్ అయూబ్. బుమ్రా బౌలింగ్‌లో 6 సిక్స

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ ప్లేయర్ సైమ్ అయూబ్. బుమ్రా బౌలింగ్‌లో 6 సిక్సర్లు కొడతానంటూ...సైమ్ అయూబ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా మరో నాలుగు రోజుల్లో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. సెప్టెంబర్ 14వ తేదీన దుబాయ్ వేదికగా....టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇలాంటి నేపథ్యంలో... టీమిండియా, పాకిస్థాన్ జట్ల ప్లేయర్లు, మాజీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యంగా భారత ప్లేయర్లను ఆత్మస్థైర్యం దెబ్బతినేలా...పాకిస్థాన్ మాజీలు రెచ్చగొడుతున్నారు. ఇందులో భాగంగానే..బుమ్రాను రెచ్చిగొడుతున్నారు. బుమ్రా బౌలింగ్‌లో 6 సిక్సర్లు కొడతానంటూ...సైమ్ అయూబ్ ఛాలెంజ్ చేశాడని పాకిస్థాన్ కు చెందిన తన్వీర్ అహ్మద్ వెల్లడించారు. కచ్చితంగా టీమిండియాపైన పాకిస్థాన్ గెలుస్తుందన్నారు. ఆ మేరకు ప్లాన్ కూడా చేసినట్లు స్పష్టం చేశారు.






