- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్తాచాటిన హైదరాబాద్ అమ్మాయి.. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం కైవసం
భారత యువ సంచలనం, హైదరాబాదీ అమ్మాయి కలగోట్ల వెన్నెలతోపాటు మరో యువ షట్లర్ తన్వి అంతర్జాతీయ వేదికపై సత్తాచాటారు.

దిశ, స్పోర్ట్స్ : భారత యువ సంచలనం, హైదరాబాదీ అమ్మాయి కలగోట్ల వెన్నెలతోపాటు మరో యువ షట్లర్ తన్వి అంతర్జాతీయ వేదికపై సత్తాచాటారు. బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలిచారు. టోర్నీ చరిత్రలో భారత్ నుంచి ఇద్దరు ఉమెన్స్ సింగిల్స్ ప్లేయర్లు పతకాలు గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇండోనేషియాలో జరుగుతున్న టోర్నీలో వెన్నెల, తన్వి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరి జోరు చూస్తుంటే స్వర్ణ పతకాలు తెచ్చేలా కనిపించారు. అయితే, సెమీస్‌లో ఓడటంతో బ్రాంజ్ మెడల్స్‌తో సరిపెట్టారు. శనివారం జరిగిన సెమీస్‌లో వెన్నెల 15-21, 18-21 తేడాతో చైనాకు చెందిన లియు సి యా చేతిలో పోరాడి ఓడింది. 37 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ షట్లర్ ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చింది.కానీ, చైనా క్రీడాకారిణి దూకుడుగా ఆడి విజయం సాధించింది. మరో సెమీస్‌లో తన్వి 13-21, 14-21 తేడాతో చైనాకే చెందిన యిన్ యి క్వింగ్ చేతిలో ఓడిపోయింది. తొలి గేము కోల్పోయిన తర్వాత రెండో గేములో పుంజుకున్న తన్వి ఒక దశలో 6-1తో లీడ్‌లో నిలిచింది. కానీ, యిన్ తిరిగి బలంగా పుంజుకోవడంతో పరాజయం తప్పలేదు.






