- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
chess ban: తాలిబన్లు మరో షాకింగ్ నిర్ణయం.. ఆఫ్గనిస్తాన్ లో ఆ గేమ్ బ్యాన్
తాలిబన్లు మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) లోని తాలిబన్ (Taliban) ప్రభుత్వం మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నది. తమ దేశంలో చెస్ ఆటను బ్యాన్ (bans chess) చేసింది. మతపరమైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని ఖామా ప్రెస్ నివేదించింది. మే 11 నుంచి చెస్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తాలిబన్ నేతృత్వంలోని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు ధ్రువీకరించారు. చెస్ జూదానికి మూలంగా పరిగణిస్తున్నామని ఇది గత సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన ధర్మ ప్రచారం, దుర్మార్గ నివారణ చట్టం ప్రకారం నిషేధించబడిందని స్పోర్ట్స్ డైరెక్టరేట్ ప్రతినిధి అటల్ మష్వానీ తెలిపారు. ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించే వరకు చెస్ పై ఈ నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
కాగా తాలిబన్లు తీసుకున్న ఈ నిర్ణయంపై కాబూల్ లో అనధికారిక చెస్ పోటీలను నిర్వహించిన ఓ కేఫ్ యజమాని అజీజుల్లా గుల్జా స్పందిస్తూ అనేక ఇతర ఇస్లామిక్ దేశాలు అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లను కలిగి ఉన్నారని చెప్పారు. చెస్ ను నిషేధిస్తూ తాలిబన్లు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని కానీ తన వ్యాపారానికి, ఆటను ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఆటకంగా మారుతుందని చెప్పారు. కాగా అధికారంలోకి వచ్చాక తాలిబన్లు పలు సంచలన నిర్ణయాలతో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మహిళలు క్రీడలు ఆడకూడదని ఇప్పటికే ఇక్కడ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.






