- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20WorldCup2026: సూపర్-8లో భారత్ తలపడేది ఈ జట్లతోనే!
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇప్పటివరకు టీమిండియా ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. దీంతో సూపర్-8కి అర్హత లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(T20WorldCup2026)లో భాగంగా ఇప్పటివరకు టీమిండియా(Team India) ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. దీంతో సూపర్-8కి అర్హత లభించింది. తాజాగా సూపర్-8లో భారత్‌తో తలపడే జట్లు ఖరారు అయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ జట్లతో భారత్ తలపడనుంది. ఈనెల 22న అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ మైదానం వేదికగా భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్, ఈనెల 26న చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్ - బింబాబ్వే మధ్య రెండో మ్యాచ్, మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య మూడో మ్యాచ్ జరుగనుంది. ఈ మూడింట్లో ఏవేని రెండు జట్లపై తప్పకుండా ఘన విజయం సాధిస్తే సూపర్-8కి అర్హత దక్కుతుంది.
మరోవైపు బుధవారం నమీబియాతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే పాకిస్తాన్ జట్టు కూడా సూపర్-8కి అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై నమీబియా విజయం సాధిస్తే యూఎస్‌ఏ సూపర్-8కి వెళ్తుంది. పాకిస్తాన్‌పై గెలిచాక.. భారత్‌పై 140+ పరుగులు లేదా 17 ఓవర్లు మిగిలి ఉండగా నమీబియా గెలిస్తే నెదర్లాండ్స్ నెక్స్ట్ ఫేజ్‌కి వెళ్తుంది. నమీబియా ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. దీంతో రేపటి పాకిస్తాన్ - నమీబియా మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.






