T20WorldCup2026: ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత బ్యాటర్లు.. ఇంగ్లండ్ ఎదుట భారీ టార్గెట్

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-05 15:19:43  IST  )

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

T20WorldCup2026: ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత బ్యాటర్లు.. ఇంగ్లండ్ ఎదుట భారీ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(ICC Men's T20 World Cup 2026) సెమీఫైనల్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. చావో రేవో తేల్చుకోవాల్సిన కీలక మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి రెచ్చిపోయారు. సిక్సులు, ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లకు చెమటలు పట్టించారు. మొత్తంగా ఏడు సిక్సులు, ఎనిమిది ఫోర్లతో సంజూ(89) పరుగులు చేశారు. శాంసన్ వీరవిహారంతో ప్రత్యర్థి బౌలర్లు నిస్సహాయులుగా మిగిలిపోయారు. సంజూతో పాటు శివమ్ దూబే (43), ఇషాన్ కిషన్ (39), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) అద్భుతంగా రాణించారు. సూర్యకుమార్ (11), అభిషేక్ శర్మ (8) నిరాశపర్చారు. మొత్తంగా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన టీమిండియా 253 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ రెండు వికెట్లు, ఆదిల్ రషిద్ రెండు వికెట్లు, ఆర్చర్ ఒక వికెట్ తీశారు. శివమ్ దూబే, హార్దిక్ రనౌట్ అయ్యారు. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 254 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 8న జరగనున్న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది.

Next Story