T20WorldCup : నేటి నుంచే మహిళల T20 వరల్డ్ కప్

by Disha Web Desk 10 |
T20WorldCup : నేటి  నుంచే  మహిళల  T20 వరల్డ్ కప్
X

దిశ, వెబ్ డెస్క్ : క్రికెట్ అభిమానులకు మరోసారి మహిళల వరల్డ్ కప్ వినోదం అందనుంది. ICC నిర్వహిస్తున్న మహిళల వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభమవ్వనుంది. మొదటి మ్యాచ్లో శ్రీలంకతో సౌతాఫ్రికా జట్టు తల పడనుంది.

ఈ వరల్డ్ కప్ ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు జరగనుంది.ఇక గత వరల్డ్ కప్ లో టీమిండియా రన్నరప్‌ గా ఉంది. ఈ సారి కప్ ఎలా అయినా కొట్టాలని టీమిండియా బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్లు కూడా బలంగా ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా జట్టు గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచి.. బరిలోకి దిగుతుంది.

అసలైన మ్యాచ్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. Group B లో టీమిండియాతో , పాకిస్థాన్ తలపడనుంది. భారత్ , పాక్ అంటే మన అందరికి తెలిసిందే కదా.. ఆ రోజు క్రికెట్ అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోతారు.

వరల్డ్‌ కప్‌లో టీమిండియా షెడ్యూల్ వివరాలు ఇవే

2023 ఫిబ్రవరి 12 : భారత్ Vs పాకిస్థాన్

2023 ఫిబ్రవరి 15 : భారత్ Vs వెస్టిండీస్

2023 ఫిబ్రవరి 18 : భారత్ Vs ఇంగ్లాండ్

2023 ఫిబ్రవరి 20 భారత్ Vs ఐర్లాండ్

Next Story

Most Viewed