- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపే T20 వరల్డ్ కప్ జట్టు ప్రకటన..గిల్ కు ఊహించని షాక్ ?
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ దాదాపు పూర్తయింది. ఈ టోర్నమెంట్ పూర్తికాగానే జనవరిలో న్యూ

దిశ, వెబ్ డెస్క్: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ దాదాపు పూర్తయింది. ఈ టోర్నమెంట్ పూర్తికాగానే జనవరిలో న్యూజిలాండ్ తో వన్డేలతో పాటు టీ20లు ఆడనుంది భారత జట్టు. అనంతరం ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటుంది. అయితే ఈ రెండు సిరీస్ ల నేపథ్యంలో భారత జట్టును రేపు ప్రకటించనున్నారు. డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో భారత జట్టును ప్రకటిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అజిత్ అగార్కర్ రేపు ప్రెస్ మీట్ పెట్టి, జట్టును ప్రకటించనున్నాడు.
అయితే ఈ జట్టులో గిల్ కు ఛాన్స్ రాకపోవచ్చని కొంత మంది అంచనా వేస్తున్నారు. లెగ్ ఇంజురీ నేపథ్యంలో అతన్ని పరిగణలోకి తీసుకోబోరని చెబుతున్నారు. అటు T20లలో అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్న తరుణంలో పక్కకు పెట్టే ఛాన్సు ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, అంత పెద్ద ప్లేయర్ ను పక్కకు పెట్టేందుకు బీసీసీఐ కూడా ధైర్యం చేయబోదని కొంతమంది అంటున్నారు. ఒకవేళ పక్కకు పెట్టాలనుకుంటే న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ నుంచి గిల్ ను తప్పించే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ జట్టులో కచ్చితంగా గిల్ ఉంటాడని చెబుతున్నారు. అద్భుతం జరిగితే తప్పా, గిల్ పేరు తొలగించే ఛాన్స్ ఉండబోదని అంటున్నారు.






