T20 World Cup: ఫైన‌ల్స్ లో అభిషేక్ ఆడ‌టంపై కీల‌క ప్ర‌క‌ట‌న !

by velandi.Saikiran |

ఇండియా, న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రిగే ఫైన‌ల్ లో అభిషేక్ శ‌ర్మ ఆడే ఛాన్సులు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

T20 World Cup key announcement on abhishek sharma playing in final full informantion
X

T20 World Cup key announcement on abhishek sharma playing in final full informantion

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మ ప్రదర్శన చెత్తగా ఉన్న సంగతి తెలిసిందే. అతన్ని మొన్నటి వరకు మెచ్చుకున్న అభిమానులు అందరూ... ఇప్పుడు బండ బూతులు తిడుతున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్స్ లో బాగా ఆడతాడు కానీ.. ఐసీసీ టోర్నమెంట్ లో అతని ప్రభావం ఏ మాత్రం లేదని ట్రోలింగ్ కూడా చేస్తున్నారు భారత అభిమానులు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో అతడు ఇప్పటి వరకు 100 పరుగులు కూడా దాటలేక పోయాడు. ఒకే ఒక అర్థ సెంచరీ నమోదు చేయగా.. వరుసగా మూడు సార్లు డకౌట్ అయ్యాడు ఈ మహాత్ముడు అభిషేక్. ఈ తరుణంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ లో అభిషేక్ శర్మ ఆడడం కష్టమేనని సోషల్ మీడియాలో కొంత మంది ప్రచారం చేస్తున్నారు.

అభిషేక్ శర్మ ఫైనల్స్ ఆడడంపై క్లారిటీ

అభిషేక్ శర్మ పేలవ ఫామ్ నేపథ్యంలో అతడు ఫైనల్ ఆడడంపై తాజాగా క్లారిటీ వచ్చింది. అభిషేక్ శర్మను పక్కకు పెట్టాలని అభిమానులందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ భారత జట్టు యాజమాన్యం మాత్రం డిఫరెంట్ గా ఆలోచన చేస్తుంది. ఫైనల్ మ్యాచ్ లో కచ్చితంగా అభిషేక్ శర్మకు అవకాశం ఇచ్చేందుకు అడుగులు వేస్తున్నట్లు పీటీఐ వెల్లడించింది. అభిషేక్ శర్మ క‌చ్చితంగా ఫైనల్ మ్యాచ్ లో క్లిక్ అవుతాడు అన్న నమ్మకంతో గంభీర్ గ్యాంగ్ ఉందని తెలిపింది.

వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న భారత జట్టులో మార్పులు చేస్తే ప్రమాదం పొంచి ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇదే విషయాన్ని భారత యాజమాన్యం ఆలోచన చేస్తున్నట్లు పీటీఐ స్పష్టం చేసింది. అంటే ఈ లెక్కన ఫైనల్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడతాడు అన్నమాట. మరి ఇంతలా అభిషేక్ శర్మకు అవకాశం ఇస్తున్న భారత జట్టు యాజమాన్యం.. నమ్మకం నిలుస్తుందో? లేదో చూడాలి. కానీ ఒక్కసారి అభిషేక్ శర్మ క్లిక్ అయితే మాత్రం.. ప్రత్యర్థికి నరకం కనిపిస్తుంది. ఈ విషయాన్ని కూడా అభిమానులు స్పష్టం చేస్తున్నారు. అటు సంజు శాంస‌న్ కూడా అభిషేక్ శ‌ర్మ క్లిక్ అవుతాడ‌నే న‌మ్మ‌కాన్ని క‌న‌బ‌రిచారు. కాగా మార్చి 8వ తేదీన భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.

Next Story