T20 World Cup: టాస్ గెలిచిన ఇటలీ.. మొదట బ్యాటింగ్ చేయనున్న స్కాట్లాండ్

by Kema Shiva Kumar |

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్లాండ్, ఇటలీ జట్టు తలపడుతున్నాయి.

T20 World Cup: టాస్ గెలిచిన ఇటలీ.. మొదట బ్యాటింగ్ చేయనున్న స్కాట్లాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్లాండ్, ఇటలీ జట్టు తలపడుతున్నాయి. చరిత్రలో ఫస్ట్‌ టైమ్ ఇటలీ ఇంటర్నేషన్ టీ20 మ్యాచ్ ఆడబోతోంది. ముందుగా టాస్ నెగ్గిన ఇటలీ కెప్టెన్ వేన్ మ్యాడ్సెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, తమ మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయిన స్కాట్లాండ్, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాయింట్స్ టెబుల్‌లో ఖాతా తెరవాలని చూస్తోంది. మరోవైపు మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో విజయంతో బోణీ కొట్టాలని ఇటలీ చూస్తోంది.

స్కాట్లాండ్ జట్టు: జార్జ్ మున్సే, మైఖేల్ జోన్స్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, రిచీ బెరింగ్టన్ (C), మాథ్యూ క్రాస్ (WK), మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్ వీల్, బ్రాడ్ కర్రీ.

ఇటలీ జట్టు: జస్టిన్ మోస్కా, ఆంథోనీ మోస్కా, జెజె స్మట్స్, వేన్ మ్యాడ్సెన్ (C), మార్కస్ కాంపోపియానో, హ్యారీ మాంటి, గ్రాంట్ స్టెవర్ట్, బెన్ మాంటి, జస్‌ప్రీత్ సింగ్, క్రిషన్ కలుగమగే, అలీ హసన్.

Next Story