- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సంజు శాసనం’.. వెస్టిండీస్‌పై భారత్ అద్భుత విజయం
టీ20 ప్రపంచకప్, సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(ICC Men's T20 World Cup 2026), సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. మొత్తంగా ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ చివరి వరకు పోరాడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోగా.. వెస్టిండీస్ సెమీస్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ గెలుపుతో భారత్ సెమీస్‌కు చేరింది. భారత జట్టు బ్యాటర్లలో సంజూ శాంసన్ (97), సూర్యకుమార్ యాదవ్ (18), తిలక్ వర్మ (27), హార్దిక్ పాండ్యా(17), శివమ్ దూబే(8)తో రాణించారు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, షమర్ జోసెఫ్ రెండు వికెట్లు, అకేల్ హోసేన్ ఒక వికెట్ తీశారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (40), జాసన్ హోల్డర్ (37*), రోమన్ పావెల్ (34*), షై హోప్ (32), షిమ్రాన్ హెట్మయెర్ (27), షెర్ఫానె రూథర్ఫోర్డ్ (14) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2.. హార్దిక్, వరుణ్ తలో వికెట్ తీశారు.






