- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20WorldCup2026: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా
టీ20 ప్రపంచకప్, సూపర్-8లో భాగంగా నేడు అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(ICC Men's T20 World Cup 2026), సూపర్-8లో భాగంగా నేడు అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగబోతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా భారత్ - వెస్లిండీస్(India vs West Indies) జట్టు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు, ఓడిన జట్టు ఇంటికి వెళ్లనున్నాయి. సూపర్-8లో ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం. ఇప్పటికే ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు వెళ్లాయి.
భారత్: సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
వెస్టిండీస్: షాయ్ హోప్(వికెట్ కీపర్/కెప్టెన్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్.






