- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20 Semi final: కట్టుదిట్టంగా కివీస్ బౌలింగ్.. 5 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా
2026 టీ20 ప్రపంచ కప్ తొలి సెమీ-ఫైనల్‌లో న్యూజీలాండ్ ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు తడబడుతున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ కీలక పోరులో కివీస్ బౌలర్లు రచిన్ రవీంద్ర, మెక్కోంచీ చెలరేగారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మొదటి సెమీ-ఫైనల్‌లో సౌతాఫ్రికా (South Africa) జట్టు ఎదురీదుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ (New Zealand) కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (Mitchell Santner) ఏమాత్రం తడబడకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయతే, ఇన్నింగ్స్ ఆరంభంలోనే దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. కోల్ మెక్కోంచీ వేసిన రెండో ఓవర్‌లోనే స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ (12), రికల్టన్ (0) వరుస బంతుల్లో అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ (18), యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ (34) కాసేపు పోరాడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
టపటపా పడిన వికెట్లు..
రచిన్ రవీంద్ర (Rachin Ravindra) బౌలింగ్‌లో మార్క్రామ్, డేవిడ్ మిల్లర్ (13) పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా 101 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయింది. 14 ఓవర్లు ముగిసేసరికి 5 కీలక వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా 101 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్కో జాన్సెన్ (17), ట్రిస్టన్ స్టబ్స్ (7) పరుగులతో పోరాటం చేస్తున్నారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో కోల్ మెక్కోంచీ 2 వికెట్లు, రచిన్ రవీంద్ర 2 వికెట్లు తీసుకున్నారు.






