- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC Champions Trophy : ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. హైబ్రిడ్ మోడల్‌కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం వీడింది.

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం వీడింది. ఈ టోర్నీలో హైబ్రిడ్ మోడల్‌కు ఐసీసీ శుక్రవారం ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, దుబాయ్ వేదికగా మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ, పీసీబీల మధ్య ఒప్పందం కుదిరింది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ స్టేజ్ మ్యాచ్‌లకు వెళ్లకూడదని పాకిస్తాన్ నిర్ణయించింది. తన మ్యాచ్‌లను కొలంబో వేదికగా పాకిస్తాన్ ఆడనుంది. ఈ ప్రతిపాదనకు గానూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఎలాంటి అదనపు ఆర్థిక సాయాన్ని ఐసీసీ అందించడం లేదు. కానీ 2027లో జరిగే మహిళల ఐసీసీ ఈవెంట్ హోస్టింగ్ హక్కులను పీసీబీ పొందింది. ఈ నిర్ణయంతో ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ సంతృప్తి చెందినట్లు తెలిసింది.
ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా నిర్వహించడం దాదాపు ఖాయమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయమై పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు. ఒప్పందం ఫైనల్ అయ్యే ముందు పీసీబీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 2025లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగాల్సి ఉంది. ఈ టోర్నీలో మొత్తం రెండు గ్రూపుల్లో 8 దేశాలు పాల్గొంటాయి. ప్రతి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. గతేడాది పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన 50 ఓవర్ల ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. భారత్ తన మ్యాచ్ లన్నింటిని కొలంబో వేదికగా ఆడింది.






