- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైభవ్ సూర్యకుమార్‌కు ప్రమోషన్.. బిహార్ రంజీ జట్టు వైస్ కెప్టెన్‌గా నియామకం
భారత అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీ బిహార్ రంజీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియామకమయ్యాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీ బిహార్ రంజీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియామకమయ్యాడు. బుధవారం నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభంకానుండగా బిహార్ క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) సోమవారం తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును వెల్లడించింది. బ్యాటర్ సాకిబుల్ గణిని తమ సారథిగా నియమించింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఈ ఏడాది ఐపీఎల్‌లోకి యంగెస్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చి సంచలనం నెలకొల్పినప్పటి నుంచి అతని పేరు మారుమోగుతూనే ఉంది.
రాజస్థాన్ రాయల్స్ తరపున గుజరాత్‌పై 35 బంతుల్లోనే సెంచరీ బాది టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. అలాగే, ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనలోనూ భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆసిస్‌తో తొలి మల్టీ డే మ్యాచ్‌లో 78 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఇంగ్లాండ్‌లోనూ అదే దూకుడు కొనసాగించిన అతను యూత్ వన్డేలో ఫాస్టెస్ట్ శతకం బాదాడు. ఆ సిరీస్‌లో మొత్తం 355 రన్స్ చేసి హయ్యెస్ట్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌కు బీసీఏ వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, అతను రంజీ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండకపోవచ్చు. వచ్చే ఏడాది అండర్-19 వరల్డ్ కప్ జరుగుతుండగా.. జట్టులో స్థానం కోసం అతను పోటీలో ఉన్నాడు.
బిహార్ రంజీ జట్టు
పీయూష్ కుమార్, భాష్కర్ దూబే, సాకిబుల్ గణి(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ(వైస్ కెప్టెన్), అర్నవ్ కిశోర్, ఆయుశ్ లోహరుక, బిపిన్ సౌరభ్, అమోద్ యాదవ్, నవాజ్ ఖాన్, సాకిబ్ హుస్సేన్, రాఘవేంద్ర ప్రతాప్ సింగ్, సచిన్ కుమార్, హిమాన్షు కుమార్, ఖలిద్.






