- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ20ల్లో సూర్య పేలవ ఫామ్.. భారత కెప్టెన్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
by Harish |
టీ20ల్లో పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా మారిన భారత కెప్టెన్ సూర్యకుమార్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు.

X
దిశ, స్పోర్ట్స్ : టీ20ల్లో పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా మారిన భారత కెప్టెన్ సూర్యకుమార్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. తన యూట్యూబ్ చానెల్‌లో చోప్రా మాట్లాడుతూ.. కెప్టెన్‌గా సూర్య పని కేవలం టాస్ వేయడం మాత్రమే కాదంటూ మండిపడ్డాడు. ‘సూర్య నువ్వు జట్టు సారథివి. కానీ, కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం, బౌలర్లను మేనేజ్ చేయడం, వ్యూహాలు రూపొంచడం మాత్రమే కాదు. నువ్వు టాప్-4లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరుగులు చేయడం కూడా నీ బాధ్యతే. చాలా మ్యాచ్‌ల్లో సూర్య రాణించలేదు. 17 ఇన్నింగ్స్‌లో సగటు 14 మాత్రమే. స్ట్రైక్‌రేట్ కూడా బాగా లేదు. ఒక్క హాఫ సెంచరీ చేయలేదు. రెండుసార్లు మాత్రమే 25 పరుగులు దాటావు.’అంటూ సూర్యపై విమర్శలు చేశాడు. సూర్య నాయకత్వంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని, వాస్తవం ఏంటంటే అతను పరుగులు చేయాలని వ్యాఖ్యానించాడు.
Next Story






