అద్భుతమైన క్యాచ్ పట్టిన సూర్యకుమార్.. ఒకటి కాదు డబుల్..

by Disha Web Desk 13 |
అద్భుతమైన క్యాచ్ పట్టిన సూర్యకుమార్.. ఒకటి కాదు డబుల్..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య 3వ T20 సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ స్లిప్‌లో రెండు అద్భుతమైన ఫ్లయింగ్ క్యాచ్‌లను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 235 పరుగుల భారీ స్కోర్ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 7 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి చెత్త ఆరంభాన్నిచ్చింది. న్యూజిలాండ్ బ్యాటర్స్‌లో.. ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్‌లను ఆదిలోనే కట్టడి చేయడంలో హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సక్సెస్ అయ్యారు. హార్దిక్ బౌలింగ్‌లో, సూర్యకుమార్ యాదవ్ స్లిప్స్‌లో రెండు స్టన్నింగ్ క్యాచ్‌లను అందుకున్నాడు. అలెన్, ఫిలిప్స్ పెవిలియన్‌కు పంపాడు. ఈ రెండు వండర్ క్యాచ్‌లు కూడా ఒకేస్టైల్‌లో ఉండటం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హార్దిక్ తన తొలి ఓవర్‌లో ఒక వికెట్, రెండో ఓవర్‌లో మరో వికెట్ తీసి భారత్‌కు రెండు ముఖ్యమైన వికెట్లు అందించాడు. రెండు సందర్భాల్లోనూ బంతి బ్యాట్ అంచుని తగిలి సూర్యకుమార్ చేతుల్లోకి వెళ్లింది. ఈ రెండు సార్లు బంతిని పట్టుకోవడానికి సూర్య భారీ జంప్, స్ట్రెచ్ చేయాల్సి వచ్చింది. ఈ రెండు క్యాచ్‌లు కూడా సూర్య ఒకేలా అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్యాచ్‌లను చూసి క్రికెట్ అభిమానులు వావ్ సూపర్.. అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.



Next Story