- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గెలిచిన జోష్.. వర్షంలోనే సూర్య రచ్చ మాములుగా లేదుగా !
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... బుధవారం రోజున ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... బుధవారం రోజున ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. డూ ఆర్ డై మ్యాచ్ లో... ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేసింది. దీంతో.. ఈ మ్యాచ్ లో 59 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ముంబై ఇండియన్స్. మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్స్ ఆడి.. ఐదు వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది.
ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా కష్టాలు పడింది. 18.2 ఓవర్లలోనే... 121 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్. దీంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించి నేరుగా ప్లే ఆఫ్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ 43 బంతుల్లో 73 పరుగులు చేశాడు. దీంతో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది.
ఇక ఈ అవార్డు అందుకునే క్రమంలో... ముంబై గ్రౌండ్ లో భారీ వర్షం కురిసింది. దీంతో ముంబై ఇండియన్స్ కు సంబంధించిన గొడుగు... పట్టుకొని తన అవార్డు తీసుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. వర్షం పడుతున్న లెక్కచేయని సూర్య... తన అవార్డు కోసం గొడుగు పట్టుకుని... హాట్ టాపిక్ అయ్యారు. ఈ సందర్భంగా సూర్య కుమార్ యాదవ్ చేసిన కామెడీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
RAIN + UMBRELLA + POST MATCH PRESENTATION..!!! 😂👌 pic.twitter.com/eukDvhIvL6
— Johns. (@CricCrazyJohns) May 21, 2025






