సూర్యను కాపీ కొట్టబోయి బుక్కైన పాక్ కెప్టెన్.. అసలు బుద్ది చూపించావంటూ ఫ్యాన్స్ ఫైర్

by Harish |

ఆసియా కప్ మొత్తం మ్యాచ్‌ ఫీజును భారత ఆర్మీకి అందజేస్తానని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ తెలిపాడు.

సూర్యను కాపీ కొట్టబోయి బుక్కైన పాక్ కెప్టెన్.. అసలు బుద్ది చూపించావంటూ ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్ మొత్తం మ్యాచ్‌ ఫీజును భారత ఆర్మీకి అందజేస్తానని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ తెలిపాడు. పాక్‌తో ఫైనల్‌లో గెలిచిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య మాట్లాడుతూ.. ట్రోఫీ తిరస్కరించడంపై స్పందించాడు.‘నాకు తెలిసినంత వరకు చాంపియన్ జట్టు ట్రోఫీని తిరస్కరించడం మొదటిసారి చూస్తున్నా. టైటిల్ మాకు అంత సులభంగా దక్కలేదు. చాలా కష్టపడి సాధించాం. కాబట్టి, ట్రోఫీకి మేము అర్హులం.’అని తెలిపాడు. ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫే నాకు నిజమైన ట్రోఫీలు అని చెప్పాడు. ‘ట్రోఫీల గురించి నన్ను అడిగితే.. నా ట్రోఫీలు డ్రెస్సింగ్ రూంలో ఉన్నాయి. ఆసియా కప్‌ ప్రయాణంలో భాగమైన 14 మంది ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్‌కు నేను నిజమైన అభిమానిని. వారే నాకు ట్రోఫీలు. నిజమైన ట్రోఫీలు. ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకాలు’అని తెలిపాడు. అలాగే, ఆసియా కప్‌ ట్రోఫీ ఇమేజీతో ఉన్న ఫొటోను సూర్య ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ‘మ్యాచ్ ముగిశాక చాంపియన్లే గుర్తుంటారు. ట్రోఫీలు కాదు.’అని క్యాప్షన్ ఇచ్చాడు.

బుద్ది చూపెట్టిన పాక్ కెప్టెన్

అవార్డు ప్రెజెంటేషన్‌లో పాక్ కెప్టెన్ అఘా సల్మాన్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రన్నరప్ ప్రైజ్‌మనీ చెక్ తీసుకున్న అతను ప్రెజెంటర్‌తో మాట్లాడటానికి వెళ్లేటప్పుడు ఆ చెక్‌ను దూరంగా విసిరేశాడు. క్రీడా స్ఫూర్తి గురించి మాట్లాడే సల్మాన్ ఇప్పుడు ఇలా వ్యవహరించడంపై క్రికెట్ ఫ్యాన్స్ అతన్ని ఏకీపారేస్తున్నారు. అంతటితో ఆగని అతను సూర్యను కాపీ కొట్టాలని చూసి బుక్కయ్యాడు. తన మ్యాచ్ ఫీజును ఆపరేషన్ సిందూరులో మరణించిన వారి కుటుంబాలకు ఇస్తామని ప్రకటించాడు. ఉగ్రవాదులే లక్ష్యంగా భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూరులో చనిపోయింది కూడా ఉగ్రవాదాలేనని అందరికీ తెలుసు. ఇప్పుడు సల్మాన్ తన మ్యాచ్‌ ఫీజును వాళ్లకు ఇచ్చి ఉగ్రవాదానికి తమ మద్దతు ప్రకటించినట్టు అయ్యింది. దీంతో సల్మాన్‌పై భారత అభిమానులు మండిపడుతున్నారు. అసలు బుద్ది చూపించావంటూ కామెంట్లు పెడుతున్నారు.


Next Story