- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడం చర్చనీయాంశమైంది. ముంబై జట్టులో కీలక ప్లేయర్ అయిన అతన్ని ‘ఇంపాక్ట్ ప్లేయర్’ తీసుకోవడంతో పలు అనుమానాలు మొదలయ్యాయి. సూర్య గాయపడ్డాడా? లేదా ఎంఐ వ్యూహంలో భాగమా? అన్న చర్చ జరుగుతుంది. దీనిపై ఎంఐ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే క్లారిటీ ఇచ్చాడు. సూర్య చిన్న ఫిట్‌నెస్ సమస్యతో ఇబ్బంది పడ్డాడని, అందుకే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించామని తెలిపాడు.
‘అవసరం లేని స్టోరీలు సృష్టించాలని మాకు లేదు. క్యాంప్ బాగుంది. సూర్య గజ్జలో కాస్త నొప్పితో ఇబ్బందిపడ్డాడు. కానీ, ఫీల్డింగ్‌తోపాటు అన్ని బాగానే చేస్తున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత మరో మ్యాచ్‌కు ఐదు రోజుల గ్యాప్ ఉందని నాకు తెలుసు. అతనికి ఇంకాస్త సమయం ఇవ్వాలని భావించా. అతను 3, 4 ఓవర్లు కూడా వేయడానికి సిద్ధపడ్డాడు. కానీ, నేనే వద్దని చెప్పా. నేను జాగ్రత్తలు తీసుకోవాలి. కీలక ప్లేయర్లు సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటం నాకు చాలా ముఖ్యం. అన్ని ఆలోచించే నేను, మేనేజ్‌మెంట్ సూర్యను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలని నిర్ణయించుకున్నాం. అంతే తప్ప ఇంకేం లేదు.’అని జయవర్ధనే తెలిపాడు. కేకేఆరపై 8 బంతులు ఎదుర్కొన్న సూర్య 16 రన్స్ చేసి అవుటైన విషయం తెలిసిందే.






