- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ20 కెప్టెన్సీ కోల్పోతానేమోనని భయపడ్డా : సూర్యకుమార్
టీమిండియా టెస్టు, వన్డే జట్టు పగ్గాలు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా టెస్టు, వన్డే జట్టు పగ్గాలు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. టీ20ల్లో మాత్రం సూర్య సారథిగా కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత సూర్యను తప్పించి గిల్‌కు కూడా పొట్టి ఫార్మాట్ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా సూర్యకుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 కెప్టెన్సీని కోల్పోతానేమోనని భయపడ్డానని వ్యాఖ్యానించాడు. అయితే, కుంగిపోవడం లేదని, మరింత మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రేరణగా తీసుకుంటానని చెప్పాడు. ‘అబద్ధం చెప్పను. ఎవరైనా భయపడతారు. కానీ, అలాంటి భయమే మనకు ప్రేరణనిస్తుంది.’అని చెప్పాడు.
ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసిన సూర్య.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న సూర్య.. తాను భయపడే వాడినైతే అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి బంతిని అలా కొట్టేవాడిని కాదన్నాడు. తాను కష్టపడి పనిచేస్తుంటే, నిజాయితీగా ఉంటే మిగతా విషయాలు జరిగిపోతాయని చెప్పాడు. అలాగే, గిల్ గురించి మాట్లాడుతూ.. ‘గిల్‌తో నా స్నేహం మైదానంలోనే కాదు బయట కూడా బాగుంది. అతను ఎలాంటి ప్లేయరో, ఎలాంటి మనిషో నాకు తెలుసు. కాబట్టి, నేను బాగా రాణించడానికి చూస్తాను. గిల్ రెండు ఫార్మాట్లకు కెప్టెన్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నా.’అని తెలిపాడు.






