- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ అవుట్..! జట్టు పగ్గాలు దక్కేది ఎవరికంటే?
భారత టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా (Team India)లో సంచలన మార్పు చోటుచేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav)ను ఆ బాధ్యతల నుంచి తప్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ‘స్కై’ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం, దానికి తోడు ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున కేవలం 19.5 సగటుతో 195 పరుగులు మాత్రమే చేసి పేలవమైన ఫామ్‌ను కనబర్చడం సెలెక్టర్ల ఆలోచనలకు కారణమైంది. అలాగే, ప్రస్తుతం ఆయనకు 35 ఏళ్లు పైబడటంతో భవిష్యత్ టీ20 సైకిల్‌ను దృష్టిలో పెట్టుకుని యువకుడికి పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది.
రేసులో ఉన్నది వీళ్లే..
అయితే, సూర్యకుమార్ కెప్టెన్‌గా తప్పిస్తుండటంతో ఆ స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్, ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌ను విజయవంతంగా నడిపిస్తున్న శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్‌లో శ్రేయాస్‌కు మెరుగైన కెప్టెన్సీ రికార్డుతో పాటు 171 స్ట్రైక్ రేట్‌తో అద్భుతమైన ఫామ్‌లో ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారింది. అదేవిధంగా సంజూ శాంసన్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ పేర్లు కూడా కెప్టెన్ పరిశీలనో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా, వచ్చే వారం ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు జట్లను ఎంపిక చేసే సెలెక్షన్ కమిటీ సమావేశంలో కెప్టెన్సీ మార్పుపై తుది నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.






