సూర్యకుమార్‌ను డివిల్లియర్స్‌తో పోల్చిన ఆసీస్ మాజీ కెప్టెన్

by Disha Web Desk 19 |
సూర్యకుమార్‌ను డివిల్లియర్స్‌తో పోల్చిన ఆసీస్ మాజీ కెప్టెన్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. పాంటింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్‌ కూడా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఏబీ డివిల్లియర్స్‌‌ లాగే 360 డిగ్రీల్లో బ్యాటింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. ల్యాప్ షాట్‌లు, లేట్ కట్‌లు.. కీపర్ తలపై ర్యాంప్‌ షాట్‌లు ఇలా గ్రౌండ్‌లో అన్ని వైపులా షాట్లు కొట్టే సామర్ధ్యం సూర్య కుమార్ యాదవ్‌కు ఉందన్నాడు. అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చూస్తే ఏబీ డివిలియర్స్ గుర్తుకు వస్తాడని కొనియాడాడు. 31 ఏళ్ల వయస్సులో అతను నాలుగో స్థానంలో ఆడటమే సరైందని పాంటింగ్‌ సూచించాడు. అతడు షాట్‌లు ఆడే సమయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాడని.. స్పి్న్, పేస్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటాడని ప్రశంసలు కురిపించాడు.

Next Story