సూర్య కుమార్ ఖాతాలో చెత్త రికార్డ్..!

by Dishafeatures2 |
సూర్య కుమార్ ఖాతాలో చెత్త రికార్డ్..!
X

దిశ, వెబ్ డెస్క్: మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో ఓ చెత్త రికార్డ్ చేరింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో సూర్య కుమార్ యాదవ్ ఈ రికార్డును నమోదు చేశాడు. ఒకే సిరీస్ లో వరుసగా మూడు మ్యాచుల్లో ఫస్ట్ బంతికే డకౌట్ అయిన బ్యాట్స్ మేన్ గా సూర్య కుమార్ యాదవ్ రికార్డ్ సృష్టించాడు. భారత్-ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఈ నెల 17న ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో మొదటి బంతికే సూర్య కుమార్ యాదవ్ డకౌటయ్యాడు. ఇక ఈ నెల 19న విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్ లో మళ్లీ మిచెల్ చేతిలోనే సూర్య ఫస్ట్ బంతికే అవుటయ్యాడు.

ఇక ప్రస్తుతం చెన్నయ్ లోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ స్పిన్నర్ ఆస్టన్ అగర్ బౌలింగ్ లో ఫస్ట్ బాల్ కే డకౌట్ అయ్యి వెనుదిరిగాడు. టీ20ల్లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్ మేన్ గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్.. వన్డేల్లో మాత్రం ఘోరంగా విఫలమవతున్నాడు. ఇక వన్డేల్లో వరుసగా మూడు మ్యాచుల్లో డకౌట్ అయిన వారిలో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, బుమ్రా, ఇషాంత్ శర్మ, అనిల్ కుంబ్లే ఉండగా.. ప్రపంచంలో వరుసగా 4 మ్యాచుల్లో డకౌటైన లాసిత్ మలింగా ఈ కేటాగిరీలో నెంబర్ వన్ గా ఉన్నాడు.

Next Story

Most Viewed