shooting World Cup : భారత షూటర్ సురుచికి స్వర్ణం.. ఐదుకు చేరిన పతకాలు

by Harish |

ఐఎస్‌ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత షూటర్ల పతకాల పంట కొనసాగుతోంది.

shooting World Cup : భారత షూటర్ సురుచికి స్వర్ణం.. ఐదుకు చేరిన పతకాలు
X

దిశ, స్పోర్ట్స్ : అర్జెంటీనాలో జరుగుతున్న ఐఎస్‌ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత షూటర్ల పతకాల పంట కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మూడో స్వర్ణం చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో సురుచి ఇందర్ సింగ్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఆమె 583 స్కోరుతో టాప్ పొజిషన్‌లో నిలిచింది.ఫైనల్‌లోనూ సురుచి అదే జోరు కొనసాగించింది. ఆరంభంలో కాస్త వెనుకబడిన ఎలిమినేషన్ రౌండ్‌లో పుంజుకుంది. 244.6 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌ ఈవెంట్‌లో సిఫ్ట్ కౌర్,10 మీటర్ల ఎయిర్ రైఫిల్ కేటగిరీలో రుద్రాంక్ష్ పాటిల్ ఇప్పటికే గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ 5 పతకాలు సాధించగా.. అందులో మూడు స్వర్ణాలు, రజతం, కాంస్యం ఉన్నాయి.


Next Story