- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్ పై విజయం.. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక నిర్ణయం
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న రాత్రి దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో భాగంగా నిన్న రాత్రి దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ (Final match) జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో భారత జట్టు పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి 9వ సారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత దాదాపు గంటకు పైగా తర్వాత ప్రెజెంటేషన్ సెర్మనీ (Presentation Ceremony) ప్రారంభమైంది. భారత జట్టు ట్రోఫీ (trophy) తీసుకోదని ముందు నుంచే వార్తలు వచ్చాయి. పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీనే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్‌కు ప్రెసిడెంట్‌గా ఉండటమే అందుకు కారణం. ఆయన చేతుల మీద ట్రోఫీ అందుకోవడానికి భారత జట్టు ముందుకు రాలేదు.
దీంతో ‘ఈ రోజు రాత్రి టీమిండియా తమ అవార్డులను తీసుకోవడం లేదని ఏసీసీ నుంచి నాకు సమాచారం అందింది. కాబట్టి, అవార్డు ప్రెజెంటేషన్ ముగిసింది.’అని ప్రెజెంటర్ సిమోన్ డౌల్ తెలిపారు. ట్రోఫీ లేకుండానే భారత ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే అంతా ముగిసాకా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (Captain Surya Kumar Yadav) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో కీలక ట్వీట్ చేశాడు. ఆసియా కప్ టోర్నమెంట్ ఆడినందుకు తనకు ఇచ్చే తన మ్యాచ్ ఫీజుల (match fee)ను పహల్గామ్ ఉగ్రవాద దాడిలో బాధితులైన మన సాయుధ దళాలకు, బాధితుల కుటుంబాలకు మద్దతు తెలిపేందుకు విరాళం (donation)గా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు.






