IPL 2025: కేకేఆర్‌పై సన్‌రైజర్స్ సంచలన విజయం

by Ajay Maddhiboyina |

కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ వేధికగా జరిగిన మ్యాచ్‌లో కోల్ కతాపై సన్‌రైజర్స్

IPL 2025: కేకేఆర్‌పై సన్‌రైజర్స్ సంచలన విజయం
X

దిశ, వెబ్ డెస్క్: కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ వేధికగా జరిగిన మ్యాచ్‌లో కోల్ కతాపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 110 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. హెన్రిచ్ క్లాసెస్ ఈ మ్యాచ్‌లో 105 పరుగులు చేశాడు. కేవలం 39 బంతుల్లో 9 సిక్సులు, 7 ఫోర్లు కొట్టి హైరాబాద్‌కు విజయాన్ని అందించాడు. దీంతో మూడు వికెట్లు కోల్పోయి హైదరాబాద్ 278 పరుగులు చేసింది. ఈ స్కోరును కేకేఆర్ ఛేదించలేకపోయింది. కేవలం 168 పరుగులకే కేకేఆర్ ఆల్ అవుట్ అయ్యింది. నరైన్31, మనీశ్ పాండే 37, రాణా 34 పురుగుల చేశారు. వీరు తప్ప మరెవరూ రాణించలేదు. ఇక సన్‌రైజర్స్ జట్టులో బౌలర్లు మలింగ , దూబే, ఉనద్కత్ ముగ్గురూ మూడు చొప్పున వికెట్లు తీసి కేకేఆర్‌ను ఓడించడంలో కీలకంగా వ్యవహరించారు.

Next Story