- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మా వల్ల కాదు బాబోయ్.. ఈ టార్చర్ మేం తట్టుకోలేం’.. SRH మేనేజర్ సంచలన లేఖ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)పై సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్త చేసింది. మ్యాచ్ టికెట్ల విషయంలో HCA చిల్లర రాజకీయాలు చేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)పై సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ టికెట్ల విషయంలో HCA చిల్లర రాజకీయాలు చేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడింది. వివరాల్లోకి వెళితే.. సన్ రైజర్స్(Sunrisers Hyderabad) జనరల్ మేనేజర్ శ్రీనాథ్(SRH Manager Srinath) లేఖ రాశారు. ఆ లేఖ ప్రకారం.. పన్నెండేళ్లుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాం.. కానీ, గత రెండు సీజన్ల నుంచి తమకు చాలా వేధింపులు ఎదురవుతున్నాయి. ఒప్పందం ప్రకారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగే సమయంలో హెచ్‌సీఏకు 10శాతం (3900) కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నాం.. 50సీట్ల సామర్థ్యం ఉన్న ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమే.
కానీ, ఈ ఏడాది దాని సామర్థ్యం 30 మాత్రమే అని పేర్కొంటూ, అదనంగా మరో బాక్స్‌లో 20 టికెట్లు కేటాయించాలని అడిగారు. దీనిపై తర్వాత మాట్లాడుకుందామని చెప్పినా వినడం లేదు. ప్రతీ మ్యాచ్‌కూ మేము స్టేడియం అద్దె చెల్లిస్తున్నాం.. ఐపీఎల్(IPL) సమయంలో స్టేడియం మా కంట్రోల్‌నే ఉండాలి.. కానీ గత మ్యాచ్ సందర్భంగా ఎఫ్-3 బాక్సుకు తాళాలు వేశారు. అదనంగా 20 టికెట్లు ఇస్తేగానీ తెరవమంటూ బెదిరించారంటూ ఆ లేఖలో సన్ రైజర్స్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ పేర్కొన్నారు.
‘ఐపీఎల్ మ్యాచ్ల టిక్కెట్ల కోసం హెచ్సీఏ మమ్మల్ని చంపుకు తింటోంది.. హెచ్సీఏతో ఈ బాధలు పడలేం.. మరో చోటికి వెళతాం’ అని కీలక ప్రకటన చేశారు. కాగా, ఐపీఎల్ మొదలై వారం కూడా గడవలేదు.. ఇప్పటివరకు హైదరాబాద్ వేదికగా రెండంటే రెండే మ్యాచులు జరిగాయి. ఇలాంటి సమయంలో కొత్త వివాదం తెరమీదకు రావడం ఎస్ఆర్‌హెచ్ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.






