ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ చారిత్రాత్మక విజయాలు

by Malleboina Mahesh |   (  Updated:2025-04-26 04:59:47  IST  )

ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. గత సీజన్లో ఫైనల్ వరకు చేరుకున్న ఆరెంజ్ ఆర్మీ.. రన్నరప్ గా నిలిచింది.

ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ చారిత్రాత్మక విజయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. గత సీజన్లో ఫైనల్ వరకు చేరుకున్న ఆరెంజ్ ఆర్మీ.. రన్నరప్‌గా నిలిచింది. అలాగే ఈ సీజన్ కు ముందు జరిగిన మెగా వేలంలో కీలక ప్లేయర్లు రిటైన్ చేసుకొని.. వేలంలో మరికొంతమంది యువ ప్లేయర్లను కొనుగోలు చేశారు. దీంతో జట్టు లైనప్ చూసిని క్రికెట్ విశ్లేషకులు సన్ రైజర్స్ జట్టు ఈ సంవత్సరం సంచలనాలు సృష్టించనుందని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగానే మొదటి మ్యాచుల్లో 286 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే రెండవ అత్యధిక స్కోరు నమోదు చేసింది. అయితే తదుపరి మ్యాచుల్లో వరుసగా ఓటమి చెందడంతో అంతా నిరుత్సాహానికి గురయ్యారు ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియంలో ఏకంగా 245 పరుగుల లక్ష్యాన్ని 18. 3 ఓవర్లలో చేదించిన సన్ రైజర్స్ జట్టు ఐపీఎల్ చరిత్ర (History of IPL)లోనే రెండో అత్యధిక చేజ్ ను నమోదు చేసింది.

అలాగే శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తో జరిగి మ్యాచులో సునాయాస విజయం సాధించిన SRH జట్టు మరో చరిత్రను నెలకొల్పింది. ఐపీఎల్ (IPL) చరిత్రలో సన్రైజర్స్ జట్టు చెన్నై హోమ్ గ్రౌండ్ అయిన చెపాక్ స్టేడియం (Chepauk Stadium)లో గెలిచింది లేదు. గత 12 సంవత్సరాలుగా ఈ స్టేడియంలో చెన్నై ఆదిపత్యం కొనసాగగా.. దాన్ని బ్రేక్ చేస్తూ ఆరెంజ్ ఆర్మీ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు కేవలం మూడు విజయాలు మాత్రమే అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఐపీఎల్ 2025 లో చారిత్రాత్మక విజయాలను నమోదు చేసుకోవడం అభిమానులకు మంచి కిక్ ను ఇచ్చింది. కాగా ఈ సీజన్ లో ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడిన SRH మూడు విజయాలు, ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ప్లే ఆఫ్ రేసు (Play off race)లో కొనసాగాలంటే మిగిలిన ఐదు మ్యాచుల్లో భారీ మార్జిన్ విజయాలు (Huge margin wins) అందుకోవాల్సి ఉంది.

Next Story