- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు లక్నో తో మ్యాచ్...300 కొట్టేందుకు కాటేరమ్మ కొడుకు రెడీ !
దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025)భాగంగా... ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. ఈ టోర్నమె

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025)భాగంగా... ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్ లో... నేడు లక్నో తో ( Lucknow) హైదరాబాద్ తలపడబోతోంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా.. ఈ మ్యాచ్ జరుగుతుంది. వీకెండ్ కాకపోవడంతో ఇవాళ ఒకే ఒక్క మ్యాచ్ నిర్వహించబోతున్నారు. ఇక లక్నో వర్సెస్ హైదరాబాద్ మధ్య ( LSG VS SRH ) జరిగే మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఏడు గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ లో ఉచితంగానే చూడవచ్చు.
అయితే... హైదరాబాద్ జట్టుతో ఇవాళ మ్యాచ్ నేపథ్యంలో... లక్నో బౌలర్లకు కొత్త టెన్షన్ నెలకొంది. హైదరాబాద్ బ్యాటర్లు అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్... చేస్తున్నారు. మొన్నటికి మొన్న.. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై హైదరాబాద్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఇషాన్ కిషన్ ( Ishan Kishan) సెంచరీ చేయగా, హెడ్ ( Head) హాఫ్ సెంచరీ తో దుమ్ము లేపాడు. ఆ దెబ్బకు 286 పరుగులు చేసింది హైదరాబాద్. అయితే ఇవాళ కచ్చితంగా హైదరాబాద్ బ్యాటర్లు మొదటి బ్యాటింగ్ చేస్తే 300 పరుగులు కొట్టడం గ్యారంటీ అంటున్నారు క్రీడా విశ్లేషకులు. బలమైన బ్యాటింగ్ ఉన్న నేపథ్యంలో 300 స్కోర్ ఖాయమని అంచనా వేస్తున్నారు. మరి ఇవాల్టి... హైదరాబాద్ ఎలా ఆడుతుందో చూడాలి. గత రికార్డులు పరిశీలిస్తే లక్నోపైన హైదరాబాద్ కు మంచి రికార్డులు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ ఇవాల్టి మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా ఉండబోతుంది.






