ఇవాళ ఢిల్లీతో మ్యాచ్... ఓడిపోతే SRH ఇంటికే

by velandi.Saikiran |

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals) మధ్య

ఇవాళ ఢిల్లీతో మ్యాచ్... ఓడిపోతే SRH ఇంటికే
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals) మధ్య 55వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ సాయంత్రం ప్రారంభమవుతుంది. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్... కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇవాళ జరిగే మ్యాచ్ లో ఒకవేళ హైదరాబాద్ జట్టు ఓడిపోతే.. ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.

ఒకవేళ గెలిస్తే ప్లే ఆఫ్ ఆశలను పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ హైదరాబాద్ మధ్య.. 25 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో 13 మ్యాచ్ లలో హైదరాబాద్ విజయం సాధిస్తే... 12 మ్యాచులలో ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ టోర్నమెంట్లో... ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడింది హైదరాబాద్.

విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) ఓడిపోయింది. అదే ఆ ఓటమి నేపథ్యంలో ఇవాళ ఢిల్లీపై ప్రతికాలం తీర్చుకునేందుకు హైదరాబాద్ ప్లేయర్లు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి. ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో అర్ధరాత్రి వరకు ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. ప్రత్యేకంగా ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ ఏరియాలో 60 బస్సులను తిప్పనున్నారు.

Next Story