- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో SRH మ్యాచ్‌లు.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బంపరాఫర్
దేశవ్యాప్తంగా ఐపీఎల్ మెగా టోర్నీ (IPL mega tournament) ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ సీజన్ లో అన్ని జట్లు గతంలో కంటే మంచి ఫామ్ ను, ఆటతీరును కనబరుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఐపీఎల్ మెగా టోర్నీ (IPL mega tournament) ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ సీజన్ లో అన్ని జట్లు గతంలో కంటే మంచి ఫామ్ ను, ఆటతీరును కనబరుస్తున్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు (Sunrisers Hyderabad team) మొదటి మ్యాచులోనే ఐపీఎల్ (IPL) చరిత్రలో రెండవ అత్యధిక పరుగులను నమోదు చేసి చరిత్ర సృష్టించింది. గత సీజన్లో సన్ రైజర్స్ సృష్టించిన విధ్వంసానికి ఈ సంవత్సరం భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో SRH హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో టికెట్లకు భారీ డిమాండ్ పెరిగిపోయింది. ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ యాజమాన్యానికి మధ్య కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో పెద్ద వివాదం నెలకొంది. HCA తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సన్ రైజర్స్ యాజమాన్యం.. తమపై ఒత్తిడి ఆపకపోతే హైదరాబాద్ ను వదిలి వెళ్లిపోతామని బహిరంగంగా ప్రకటించింది.
ఈ ప్రకటన సంచలనంగా మారడంతో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) జోక్యం చేసుకొని సయోధ్యను కుదిర్చింది. ఈ క్రమంలో ఆంధ్ర క్రికెట్ ఆసోసియేషన్ సన్ రైజర్స్ జట్టును ఏపీకి రావాలని ఆహ్వానం పలికింది. ఇందులో భాగంగా సన్ రైజర్స్ మిగిలిన మ్యాచులను వైజాగ్ స్టేడియంలో నిర్వహించాలని ACA కోరింది. సన్ రైజర్స్ ఏపీకి వస్తే.. పూర్తి స్థాయి ఏర్పాట్లను చేస్తామని, పన్ను మినహాయింపు కూడా ఇస్తామని SRH యాజమాన్యానికి ACA భారీ ఆఫర్ ప్రకటించింది. మరీ ఏపీ ఆహ్వానంపై సన్ రైజర్స్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సి ఉండగా.. SRH జట్టు ఏపీకి వెళితే.. హైదరాబాద్ లో ఉన్న క్రికెట్ అభిమానులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి సన్ రైజర్స్ జట్టు ప్రాతినిధ్యం వహిస్తుండగా..మొత్తం ఏడు మ్యాచుల్లో కనీసం 3 మ్యాచులు అయినా వైజాగ్‌లో నిర్వహించాలని క్రికెట్ విశ్లేషకులు తమ వాదనలు వినిపిస్తున్నారు.






