- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుప్పకూలిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. తక్కువ స్కోరుకే ఆలౌట్
సన్‌రైజర్స్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన! కేకేఆర్ బౌలర్ల ధాటికి కేవలం 165 పరుగులకే హైదరాబాద్ ఆలౌట్ అయింది. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో సత్తా చాటారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ కు కేకేఆర్ బౌలర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఓపెనర్లు అభిషేక్, హెడ్ కాసేపు మెరుపులు మెరిపించి నప్పటికి వరుసగా వికెట్లు పడ్డాయి. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు వచ్చిన వారు వచ్చినట్లే అవుట్ కావడంతో ఫస్ట్ టైమ్ బౌలర్లు కూడా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఈ సీజన్ లో సన్ రైజర్స్ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బౌలర్లలో నరైన్ 2, వరుణ్ చక్రవర్తి 3, త్యాగి 2, మిగిలిన బౌలర్లు ఒక్కో వికెట్ తీసుకున్నారు. సన్ రైజర్స్ బ్యాటర్లలో హెడ్ 61, కిషన్ 42, అభిషేక్ 15 మినహా ఎవరూ సరిగ్గా రాణించలేదు. దీంతో ఆరెంజ్ ఆర్మీ కేవలం 165 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచులో కేకేఆర్ విజయం సాధించాలంటే 166 పరుగులు చేయాల్సి ఉంది. మరీ ఈ సీజన్ లో తమ అత్యల్ప స్కోరును సన్ రైజర్స్ కాపాడుకొని మరో విజయాన్ని అందుకుంటుందా.. లేదా కేకేఆర్ జట్టు స్వల్ప స్కోరును సునాయాసంగా చేజ్ చేసి ఆరెంజ్ ఆర్మీ వరుస విజయాలకు బ్రేక్ వేస్తుందా తెలియాలంటే వేచి చూడాల్సిందే.






