- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత మహిళల జట్టు వరల్డ్ కప్ విక్టరీపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ విజయాన్ని 1983లో భారత పురుషుల టీమ్ వరల్డ్ కప్ విక్టరీతో పోల్చడాన్ని 1983 వరల్డ్ కప్ విన్నర్ సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ విజయాన్ని 1983లో భారత పురుషుల టీమ్ వరల్డ్ కప్ విక్టరీతో పోల్చడాన్ని 1983 వరల్డ్ కప్ విన్నర్, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. రెండు విజయాలకు ఎంతో తేడా ఉందన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు రాసిన కాలమ్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘కొందరు ఈ విజయాన్ని 1983లో పురుషుల జట్టు వరల్డ్ కప్ విక్టరీతో పోలుస్తున్నారు. కానీ, అది తప్పు. పురుషుల జట్టు అంతకుముందు ఎడిషన్లలో గ్రూపు దశలోనే వెనుదిరిగింది. నాకౌట్ రౌండ్ వాళ్లకు కొత్త. కానీ, మహిళల జట్టుకు మెరుగైన రికార్డు ఉంది. ఇంతకుముందు వారు రెండుసార్లు ఫైనల్‌కు చేరుకున్నారు. 1983 విజయం భారత క్రికెట్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియచేసింది. ఇప్పుడు ఈ విక్టరీ కూడా ఆధిపత్యం జట్లకు బ్రేక్‌లు వేసింది. 1983 గెలుపు తల్లిదండ్రులను తమ పిల్లలను క్రికెట్‌కు ఆడించేలా ప్రోత్సహించింది. అదే విధంగా ఈ విజయం మహిళల క్రికెట్‌కు కొత్త రెక్కలను తెస్తుంది. మారుమూల ప్రాంతాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకొస్తుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఇప్పటికే ఆ ప్రక్రియను ప్రారంభించింది. పేరేంట్స్ కూడా తమ కుమార్తెలకు మంచి కెరీర్‌గా చూస్తున్నారు.’అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.






